శీర్షిక: త్యాగమే మహోన్నతం ...! _కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

శీర్షిక: త్యాగమే మహోన్నతం ...! _కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

 

శీర్షిక: త్యాగమే మహోన్నతం ...!
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం


పురుటి నొప్పులు మెలికలు తిప్పే మృత్యు గండమని తెలిసినా
పుట్టుకకు కారణమై చచ్చిపుట్టిన మహోన్నత త్యాగం అమ్మ...!

కష్టాల కడలిలో ఎన్ని తుఫానులు వచ్చిన పడిలేచిన కెరటంలా 
నవ్వు ముసుగు వేసుకొని వెలుగొందే కనిపించని త్యాగం నాన్న...!

ఆకలి మంటలను కన్నీళ్ళతో చల్లార్చుకొని 
కన్నీటి చక్కలను చాటలో బియ్యంగా చేరుగుతూ
కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించి ఆకలి తీర్చే త్యాగం భార్య...!

కుటుంబ భారం కావడి కుండలుగా భుజాన మోస్తూ 
ఎచటి కెచటికో పరుగులు తీస్తూ
గుండె బరువును లెక్క చేయక బండ  చాకిరి చేసి
రేతిరి వచ్చే కౌముది వెలుతురు లా వచ్చి
భార్య బిడ్డల మోములో కాంతులు నింపే త్యాగం భర్త...!

అమ్మా నాన్నల బంధానికి పూసిన పువ్వులు
ఒకరికొకరు తోడుగా నీడగా కలిమి లేమిలో కలవడిగా ఉంటూ
జీవితమంతా ఒకే మొక్కకు అల్లుకున్న లతలుగా 
ప్రాణాలు సాహితం లెక్క చేయని రక్తబంధ త్యాగం అన్నాచెల్లెల్లు...!

కష్ట సుఖాలలో వెన్నంటూ ఉంటూ
కన్నీటి ధారాలను ఆత్మీయ స్పర్శతో తూడుస్తూ
కొండంత అండ దండ గా ఉంటూ
తప్పొప్పులను సున్నితంగా తెలియ చేస్తూ
ఎన్నడూ వీడని ఆత్మ బంధవు త్యాగం స్నేహం ...!

విత్తు మొలకెత్తి మహా వృక్షమై నీడనిస్తూ 
భూమాత ఊపిరి తిత్తులై జీవరాశులకు ప్రాణవాయువులిస్తూ
మనవుడి చేతిలో మరణిస్తూ మరణించిన వారికి పాడై
చివరికి చితిలో కాలే కట్టై 
అగ్గిలో బుగ్గై ప్రాణార్పణ  చేసిన త్యాగం చెట్టు...!
త్యాగాలు ఏమైనా త్యాగమే మహోన్నతం...!


0/Post a Comment/Comments