" హితోక్తులు "-గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

" హితోక్తులు "-గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

" హితోక్తులు "
-------------------------------
వేళాకోళం వద్దుI
దాటకూడదోయ్ హద్దు
అదేనోయ్ మేలిపొద్దు
అది అందరికీ ముద్దు

వేయాలోయ్ తాళము
పెట్టాలోయ్ గొళ్ళెము
కావాలోయ్ పళ్ళెము
కట్టాలోయ్ కళ్ళెము

దండ కట్టుటకు దారము
అదే దానికాధారము
నైతిక విలువలు అందము
కల్గియున్నచో లాభము

కరోనా పెనుభూతము
సోకితే కడు నరకము
ఉంటే మంచిది దూరము
లేకున్న బ్రతుకు ఘోరము

అప్రమత్తము అవసరము
మూతికి మాస్కులు కట్టుము
శానిటైజర్ వాడకము
కలుగజేయునిల క్షేమము
-గద్వాల సోమన్న ,
     ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments