కృషితో నాస్తి దుర్భిక్షం
వ్యక్తి గాని వ్యవస్థ గాని ఊరు కానీ దేశం కానీసృష్టించాలి సంపద
ఎదగడానికి కావాలి సంపద
తెలుసుకోవాలి సంపద సృష్టి
పెట్టాలి సంపద పెరగడానికి దృష్టి
ఉచితాలు వ్యర్ధాలు
తెస్తాయి అనేక అనర్ధాలు
తొలిగించాలి ముందు అపార్ధాలు
తెలియపరచాలి జీవిత అర్ధాలు
పాలు కావాలంటే పాలు పితకాలి కానీ పొదుగు కోయకూడదు
మనిషి ఎదగాలి అంటే మనిషి మనసు మార్చాలి కానీ యేమార్చగకూడదు
పళ్ళు కావాలంటే చెట్టునుండి కోసుకోవాలి కానీ చెట్టునే నరక కూడదు
మన పిల్లలు మనకు ఇష్టమని కావలసినవన్ని సమకూర్చి బంధిస్తే వాళ్ళు వృద్ధి చెందుతారా
అలా చేస్తే అది అభివృద్దా
అలా చేస్తే అది ప్రేమా
అలా చేస్తే వాడికి వాడి జీవితానికి న్యాయం జరుగుతుందా
వాడి భవిషత్ బాగుంటుందా
అతి ప్రేమ అనర్ధం
అతి ప్రేమ లోకవినాశనం
అతి ప్రేమ సోమరితనం
అతిప్రేమ ఉన్మాదం
ప్రతీ వ్యక్తి ఒక వనరు
ప్రతీ వనరు సంపద సృష్టే
వినియోగమే ముఖ్య దృష్టి
స్వయం కృషే స్వాలంభన
కష్టే ఫలే
కృషితో నాస్తి దుర్భిక్షం
సాధనాత్ సాధ్యతే సర్వం
ఇవే ఇవే మానవ సంపద సృష్టికి ఆయుధాలు
తీసుకో సరియైన సమయానికి సరియైన నిర్ణయం
వద్దు కంచె చేను మేసే వ్యవహారాలు
కొండలే కరుగును కూర్చొని తింటే
నేర్పు కాయకష్టం వస్తుంది మార్పు
సంపద సృష్టి అంటే కాదు మాయలు మంత్రాలు
సంపద సృష్టి అంటే కాదు ఉచితాలు పంచడం
చేసుకో వనరుల సద్వినియోగం
సృష్టించుకో స్వశక్తి తో సంపదని
రచన:పసుమర్తి నాగేశ్వరరావు
టీచర్ సాలూరు
విజయనగరం జిల్లా
ఇది నా స్వీయారచన.. హామి ఇస్తున్నాను