మార్గం ముత్యాల హారాలు ---మార్గం కృష్ణ మూర్తి, హైదరాబాద్.

మార్గం ముత్యాల హారాలు ---మార్గం కృష్ణ మూర్తి, హైదరాబాద్.

- మార్గం కృష్ణ మూర్తి

మార్గం ముత్యాల హారాలు

01.
మట్టి కుండలోన నీరు
ఆరోగ్యముండును నీరు
ఎండ కాలంలో నీరు
చల్లగా నుండును నీరు

02.
బలహీనత భయాన్ని
పిరికి తనం భయాన్ని
అజ్ఞానము భయాన్ని
చీకటి పెంచు భయాన్ని

03.
కష్టాలెప్పుడు ఉండవు
కోపాలెప్పుడు ఉండవు
దుఃఖాలెప్పుడు ఉండవు
బాధలెప్పుడు ఉండవు

04.
సేవ గుణం తృప్తి నిచ్చు
దాన గుణం తృప్తి నిచ్చు
దైవ భక్తి తృప్తి నిచ్చు
ధ్యాన గుణం తృప్తి నిచ్చు

05.
కన్న ఊరు మరువరాదు
తల్లిదండ్రిమరువరాదు
గురువును మరువరాదు
దైవాన్ని మరువరాదు

06.
పుట్టెను చిన్నగూడూరు
ఉధ్యమంలో ఉరికారు
బిరుదులెన్నోపొందారు
అతనే దాశరథి గారు

07.
వర్షాలు పడుతున్నాయి
వరదలు పారుతున్నాయి
ఇళ్ళు మునుగుతున్నాయి
బాధలు పెరుగుతున్నాయి

08.
అతినిరుపేద కుటుంబం
అబ్దుల్ కలాము జననం
పేపరు బాయిగ పయనం
రాష్ట్రపతిగాను విజయం

09.
దేవుళ్ళ కొలుస్తున్నాము
వాదించుకుంటున్నాము
కొట్లాడుకుంటున్నాము
ఉనికి  కోల్పోతున్నాము

10.
శాంతిని ఎంచుకోవాలి
చెడ్డని తుంచుకోవాలి
మంచిని పంచుకోవాలి
నిజాన్ని నమ్ముకోవాలి

11.
యాచించడముమాన్పాలి
జీవించడం నేర్పాలి
సోమరితనముమాన్పాలి
కష్టపడటం నేర్పాలి

12.
మనల పోషించు వారిని
మనల్ని నమ్మిన వారిని
మననాదరించు వారిని
మోసం చేయకు వారిని

మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments