పేదలకు అమ్మ - మదర్ థెరెసా
అల్బేనియాలో జన్మించి
భారత పౌరసత్వం పొంది
నిస్వార్థ సేవే లక్ష్యంగా
క్షయ, కుష్టు రోగులకు
అనాథలకు మరణశయ్యపై
పడివున్న బడుగు వర్గాలకు
జీవితాంతం సపర్యలు చేసిన
మానవతావాది
ధర్మశాలలు, అనాథశరణాలయాలు
ఆహారకేంద్రాలు, పాఠశాలలు
స్థాపించి పేదల పెన్నిధిగా
నిస్సహాయుల పాలిట దైవంగా
నిలిచిన మానవతామూర్తి
ఎన్ని అడ్డంకులు ఎదురైనా
తన సేవలను తాను చేసుకుంటూ
ముందుకు సాగిన మహిమాన్విత వనిత
అంతర్జాతీయ కీర్తి గడించి
ఎందరికో ఆదర్శంగా నిలిచి
మానవ హృదయాలలో
మదర్ థెరెసాగా నిలిచిన
మాతా మూర్తి అమృత మూర్తి
ఆమె మానవసేవలను గుర్తించిన
ప్రభుత్వాలు నోబెల్ బహుమతిని
భారత రత్న పురస్కారాన్ని అందించి
గౌరవాన్ని ప్రకటించాయి
ఆచార్య ఎం.రామనాథం నాయుడు
మైసూరు
+91 8762357996
Post a Comment