అమ్మ భాష పట్ల అలసతేల. ✍🏻వి.వనజ, ఆదిలాబాద్

అమ్మ భాష పట్ల అలసతేల. ✍🏻వి.వనజ, ఆదిలాబాద్



అమ్మ భాష పట్ల అలసతేల
**********************
పరుల భాష పలికి
 పరవశించేరిల
తెలుగు భాష పలుక తెగువ లేదు
తల్ల డిల్లు నపుడు తన్నుకు వచ్చేను
తల్లి భాషె యపుడు తనివి తీర
   
జాలు వారు నట్టి జాన పదమ్ముగ
జనుల మదిని గెలుచు జనని భాష
కమ్మ నికథ లెన్నొ కమనీ యముగదెల్పి
విలువ పెంచి నట్టి విమల భాష
        
పద్య ములతొ నెంతొ హృద్యముగానెన్నొ
కవిత లల్లి నట్టి కవుల భాష
సామెతలను గూడి సాగిపోయేనుగ
పలుకు బడుల నొసగు పసిడి భాష
          
కాల గర్భ మందు కలసిపో తున్నట్టి
తల్లి భాష నుడువ తరుణ మిదిర
ఆంగ్ల పాల కులును యధ్భుత మన్నట్టి
అమృత భాష మనది అలసతేల?
                ✍🏻 వల్లంభట్ల వనజ
                 ఆదిలాబాద్

0/Post a Comment/Comments