పౌరసత్వ దేశం
నా స్వతంత్ర భారతం ఎంతో త్యాగమూర్తుల పుణ్య ఫలం.
ఎంతోమంది వీరుల ప్రాణత్యాగ పుణ్యభూమి.
భారతమాత నుదిటి తిలకమై వెలసిన అమరవీరులను కన్న భాగ్యభూమి.
కులమత బేధం చూపక ఐక్యమత్వమే లక్ష్యంగా..
భిన్నత్వంలో ఏకత్వంచూపుతూ భారతదేశ గొప్పతనాన్ని చాటుకుంటూ..
సంస్కృతీ సంప్రదాయాలకు నిలయంగా..
ఎందరో మహనీయులు కీర్తి గడించిన పవిత్ర భూమి స్వాతంత్ర భారతం.
ఐక్యమత్యమే మహాబలమని చాటిచూపుతూ
మత సామరస్యానికి నిలయమై!
ఆత్మీయతలకు నిలయమై!
ఆదర్శ దేశంగా, అభివృద్ధి దేశంగా, ఆర్థిక పరంగా, పారిశ్రామిక పరంగా ….
మునుముందుకు దూకుపోతుంది
నా స్వాతంత్ర భారత దేశం.
స్వతంత్య్రం నా జన్మ హక్కు అని ప్రతి పౌరుడు
తన స్వహక్కులను వినియోగించుకున్న నాడే
నిజమైన స్వతంత్య్రం అని,
అన్ని రంగాలలో ముందుకు దూసుకు పోతూ...
చైతన్య మార్గాన్ని అధిరోహించాలని...
అప్పుడే నిజమైన స్వతంత్ర భారత దేశమని
నిజమైన పౌరసత్వం లభించిందని చెప్పవచ్చు
--వి. కృష్ణవేణి
వాడపాలెం.
తూర్పుగోదావరి జిల్లా.
9030226222
ప్రక్రియ :వచనం
ప్రక్రియ :వచనం