కలం ---సత్య మొం డ్రేటి

కలం ---సత్య మొం డ్రేటికలం కత్తి కన్నా పదునైన ఆయుధం
విప్లవానికి ఊపిరి పోస్తుంది
శాంతికి ప్రేరణనిస్తుంది
మనిషిలోని మధుర  భావాలకు అక్షర రూపం ఇస్తుంది...
కలం సాహిత్యాన్ని సృష్టిస్తుంది
కళల కాణాచిగా లిఖిస్తుంది
విద్యలో ఉన్నత స్థానం నిలిపేది కలం...
కలం సాధనతోనే విద్యా శిఖరాలు అధిరోహించాలి.. ...
మనసులోని భావవిప్లవ తరంగాలనుకలం లిఖించాలి..
అక్షర సేద్యం లో కలమే హలం..
వాగ్దేవి రూపం కలం....
కళ కళ లాడుతు కలకాలం 
నిలిచేది కలం.....

పేరు :శ్రీమతి సత్య మొండ్రేటి
ఊరు: హైదరాబాద్
తేదీ 4/8 /2081
ప్రక్రియ వచనం

0/Post a Comment/Comments