స్వచ్ఛమైన ప్రకృతి -ఆరోగ్య ప్రధాయిని
పుడమితల్లికి పచ్చదనంగా
ప్రకృతికి శోభాయమానమై
నింగికి నేలకు హద్దులమయంతో
భువిపై జీవరాసులకు ఆధారమయంగా
ప్రకృతికి సోపానమై
ప్రాణావాయువును శుద్ధిచేసే
ఆయుధ ధారినిగా
ప్రకృతికి శోభనిస్తూ..
ఆరోగ్యాకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ
జీవమనుగడకు ఎంతగానో దోహదం చేస్తూ
వాతావరణాన్ని శుద్ధి చేసి
ప్రకృతి వైపరీత్యాలనుండి
విపత్కర పరిస్థితుల నుండి
రక్షణగా..
వాయుకాలుష్య నివారిణిగా,
భూతాపాన్ని
తగ్గించే యంత్రంగా..
ఎన్నోజీవరాసులకు జీవనాధారాన్ని కల్పిస్తూ
ఆయువును పెంచే
ఔషదదారిని,
వనమూలికలనంధించే కల్పవల్లిగా
సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమై పూజలందుకున్న నిత్యవల్లిగా
కలుషితరహిత ధరణినిచ్చే
నితంతర వాహనదారినిగా
ఎగిరే పక్షులకు ఆశ్రమమై
మూగ జీవాలకు ఆహారంమై
అడుగడుగునా జీవనదారిగా.
నిలిచిన పచ్చని చెట్లను కాపాడి
పర్యావరణాన్ని పరిశుభ్రంగా
ఉంచుకుంటూ ఆరోగ్యవంతమైన
జీవనాన్ని కొనసాగిద్దాం.
వి. కృష్ణవేణి
వాడపాలెం
తూర్పుగోదావరి జిల్లా.
ప్రక్రియ :వచనం.