అహింసా పరమోధర్మః --- డా.రామక‌ కృష్ణమూర్తి, బోయినపల్లి, మేడ్చల్.

అహింసా పరమోధర్మః --- డా.రామక‌ కృష్ణమూర్తి, బోయినపల్లి, మేడ్చల్.

అహింసా పరమోధర్మః

--- డా.రామక‌ కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్.


శాంతిమార్గంలో తెలిపే నిరసన
దౌర్జన్యానికి‌ ప్రేమతో ఇచ్చే జవాబు
హింసకు ప్రతిహింస చేయకుండుట
ప్రాచీన భారతీయ సనాతన ధర్మమది
సృష్టిలోని సర్వజీవులకు వర్తించేది
బుద్ధుడు బోధించిన శాంతిమార్గం
జైనుడు అనుసరించిన జీవన విధానం
పంచమహావ్రతాల్లో మొదటిది
అశోకుడు తెలుసుకున్న నిజం
మానవకర్మల్లో ఉత్కృష్టం
మహావీరుని అనన్య సామాన్య అస్త్రం
మాటలు,చేతలు,ఆలోచనలు కూడా భాగాలే
ఋగ్వేద,యజుర్వేదాలు చాటిన గొప్పమంత్రాలు
పశుపక్ష్యాదుల పట్ల చూపవలసిన దయ
ఉపనిషత్తులు తెలిపిన సారం
సర్వభూతాలపై చూపవలసిన గొప్పగుణం
సత్యవచనం,ఆర్జవం,దానం,తపం,అహింసలు
మానవాళి అనుసరించాల్సిన మార్గాలు
శాకాహారమే దానికి అనుకూలం
ఎవరినీ హింసించకు అనే మానవత్వం
ఎవరినీ చంపకు అనే దైవత్వం
అహింసే అత్యుత్తమ ధర్మం
అహింసే గొప్పదైన స్వీయనియంత్రణం
అహింసే ఉత్తమమైన బహుమతి
అహింసే మంచిదైన ప్రయత్నం
అహింసే గొప్పదైన త్యాగం
అహింసే మంచి స్నేహితుడు
అహింసే గొప్పదైన ఆనందం
అహింసే గొప్పదైన సత్యం
అహింసే ఉత్తమమైన బోధన.


0/Post a Comment/Comments