సంతృప్తికర జీవితం..! ముహమ్మద్ ముస్తఖీమ్" విన్నర్"

సంతృప్తికర జీవితం..! ముహమ్మద్ ముస్తఖీమ్" విన్నర్"

సంతృప్తికర జీవితం..!(కవిత)


ఉన్నకాడికి మంచిగా జీవించాలి..!
సంతోషంగా కాలం గడపడం జీవిత పరమార్థం..!

ఆశల్ని అత్యాశలుగా మార్చుకుంటున్న వేళ సమస్యలు 
చుట్టుముడుతున్నాయి..!

సంతోషంగా.. 
జీవించాలంటే,
మనశ్శాంతి.. 
మిగలాలంటే,
కోరికల్ని,ఆశల్ని 
చంపుకోనక్కర్ లేదు..,
కాస్త జాగరూకతతో
వాటిని పరిమితం 
చేసుకుంటే చాలు..!

మోయదగ్గ బరువుని మాత్రమే మోయాడంలో అర్థముంది..!? 
లేకపోతే..సమస్యలు
అప్పులు కూడ ముప్పులు గా,
నిప్పులుగా,
తప్పించుకోలేని
తిప్పలుగా పరిణమిస్తాయి...!??

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్,
నాగర్ కర్నూల్ జిల్లా
తెలంగాణ.

0/Post a Comment/Comments