పలుకు తేనె లొలుకు --దొడ్డపనేని శ్రీ విద్య

పలుకు తేనె లొలుకు --దొడ్డపనేని శ్రీ విద్య


*శీర్షిక: పలుకు తేనె లొలుకు*


మేఘం నుంచి చిరుజల్లు కురిసినట్లు మధురంగా పలుకు
నెమలి పురివిప్పి నాట్య మాడునట్లు లయగా పలుకు
ఉదయించే భానుడి కిరణాలతో పుడమి తల్లి మురిసినట్లు పరవశంగ పలుకు
పలుకు జర భద్రం మిత్రమా!

పది మందికి సాయం చేయటం కన్న...
నీ మాటతో నొప్పింపకుండా ఉండటం మిన్న..
శత్రువు మిత్రుడు కావాలన్న...
మాట జర భధ్రం మిత్రమా!

మన మాట కంట్లో నలుసులా ఉండకూడదు..
మన మాట గంధం పూసినంత చల్లగా ఉండాలి...
మన మాట కత్తి లా మనసుని కోయకూడదు..
పలుకు తేనె లొలుకులా ప్రేమగా ఉండాలి...
మాట జర భద్రం మిత్రమా !

హృదయం లో నిస్వార్థ ప్రేమ ఉన్నప్పుడే..
మాట మృదువుగా వస్తుంది...
గాయం బాధ కొన్ని రోజులే ఉంటుంది...
కానీ, 
పరుష మాటల బాధ జీవితాంతం గుర్తు ఉంటుంది...
ఒకరిని బాధ పెట్టే మాటలు కట్టిపెట్టు..
ఎదుటి వారి ఆనందంలోనే  నీ వ్యక్తిత్వం అద్దం పెట్టు..
*మాట జర భధ్రం మిత్రమా!*


*హమీ పత్రం :*
*ఈ కవిత పూర్తిగా నా సొంతం.. అనుకరణ కూడా కాదు.*

పేరు: 
*దొడ్డపనేని శ్రీ విద్య*
పుట్టపర్తి

తేదీ: 27/08/2021
శుక్రవారం

0/Post a Comment/Comments