మన జాతీయ పతాకం
జాతీయోద్యమానికి
స్వరాజ్య పోరాటానికి సంకేతం
భారత జాతీయ పతాకం
జాతీయోద్యమ స్ఫూర్తికి
స్వరాజ్య పోరాట లక్ష్యానికి
ప్రతిబింబం మన జెండా
సత్యానికి ధర్మానికి
నిలువెత్తు నిదర్శనం
మన మువ్వన్నెల జెండా
కాషాయం త్యాగానికి చిహ్నం
తెలుపు సత్యానికి శాంతికి ప్రతీక
ఆకుపచ్చ సాఫల్యతకు గుర్తు
అశోక చక్రం ధర్మ పాలనకు
అపర సంకేతం
సత్యమేవ జయతే నిండిన
మన జాతీయ జెండాను
ప్రతి భారత పౌరుడు
ఆకాశ వీధుల్లో రెపరెపలాడించి
ఉత్సాహంగా జాతీయ జెండా
పండుగను జరుపుకోవాలి
స్వాతంత్ర్య, గణతంత్ర
దినోత్సవాలకు త్రివర్ణపు
జాతీయ జెండాను ఎగురవేయాలి
ఆచార్య ఎం.రామనాథం నాయుడు , మైసూరు
+91 8762357996