లోకం కోసం..! (కవిత) --ముహమ్మద్ ముస్తఖీమ్ - విన్నర్

లోకం కోసం..! (కవిత) --ముహమ్మద్ ముస్తఖీమ్ - విన్నర్

లోకం కోసం..!(కవిత)

ఎన్ని సంపదలు ఉన్నా లాభం ఏమిటీ,
దాన ధర్మాలు తెలియనప్పుడు..!??

పరులకు మేలు చేయాలని 
మనుష్యులు అనుకోనప్పుడు,
ఎన్ని హితబోధలు విని
ఏం లాభం..!??, వినిపించి ఏం లాభం..!??

దీనుల పట్ల నిరాదరణ,
అభాగ్యుల పట్ల నిర్లక్ష్యం,
బాధితుల పట్ల రాక్షసత్వం,
ఇలాంటివన్నీ దైవాగ్రహం కలిగించే 
విషయాలు కాక మాటేమిటి..!??

నిస్సహాయులను ఆదుకోవాలని 
ఎప్పుడైతే మనుష్యులు అనుకుంటారో..
సంఘంలో అందరూ బాగుండాలని 
ఎవరు కోరుకుంటారో..
ఎవరైతే మానవత్వాన్ని కురిపిస్తారో..
అలాంటి సమయంలోనే లోకంలో 
శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతూ..
వర్ధిల్లుతాయని ఆశించవచ్చు..!??

✍🏻 విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా,తెలంగాణ.

0/Post a Comment/Comments