గురువు -కంది. సత్యనారాయణ మూర్తి, విజయనగరం.

గురువు -కంది. సత్యనారాయణ మూర్తి, విజయనగరం.జీవన వికాసానికి నిచ్చెన వేసే
అక్షర కార్మికుడు..
సమాజ దేవాలయానికి
నిజమైన రక్షకుడు..
విద్యాబుద్దులు నేర్పి
జీవితాన్ని తీర్చిదిద్దేవాడు..
నైతిక విలువల
విత్తుల్ని వెదజల్లేవాడు..

అతనే జ్ఞానమై 
అతనే లోకమై 
అతనే దైవమై 
అతనే సర్వమై
మనలో 
అజ్ఞాన తిమిరాలను తొలగించి 
జ్ఞాన కాంతులు వెలిగించినాడు..!

శిలలాంటి వారిని శిల్పంగా మలచి
భవితకు బాటలు వేసినవాడు..!

మనిషిలో విలువలు పెంచి
మానవత్వపు వెలుగులు నింపేవాడు..!

ప్రతీ వ్యక్తిని సన్మార్గంలో 
నడిపించే నిత్య సత్యమే గురువు..!
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

కంది. సత్యనారాయణ మూర్తి
                    M.Sc, B.Ed, F.I.I.I
విజయనగరం
9030277529

 

0/Post a Comment/Comments