కోపం (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

కోపం (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

ముత్యాలహారం

శీర్షిక:కోపం

కోపం పాపానికి ధూపం
మనఃశ్శాంతి కి శాపం
రాక్షస స్వరూపం
పనికిరాని కూపం

మార్చును స్వరూపం
మారును ప్రతిరూపం
కానరాదు నిజరూపం
నిజముఖమే అపురూపం

మిత్రులు శత్రువులౌదురు
పక్కవారు పగౌదురు
కోపులు ఒంటరగుదురు
పదిమంది తిట్టుకుందురు

ఆరోగ్యం కుశించును
ఐశ్వర్యం నశించును
అపకీర్తి లభించును
కోపమే శాసించును

పోతుంది మన యశస్సు
కనుమరుగవును తేజస్సు
ఉండదు రోజూ ఉషస్సు
కల్మషమగును మనస్సు

ప్రతీరోజూ చింత
ప్రతీ పనిలో వింత
కల్లోలం మనసంత
కొత్తదనమే అంత

ఉండదు మానవత్వం
పోతుంది సమానత్వం
అర్ధం కాని తత్వం
పెరుగును అసమానత్వం

తిట్టుకుందురు లోకులు
ఉండవు చెప్పే సాకులు
అగుదురు లోకులు కాకులు
ఇంకా జీవితం బ్రేకులు

ఇక కోపాలు వద్దు
ప్రేమలే మన హద్దు
ఐక్యతే సరిహద్దు
మంచితనమే ముద్దు

ఆచరనే ఆనందం
పెరుగును అనుబంధం
మిగులును మంచి బంధం
అదే అనురాగబంధం

0/Post a Comment/Comments