గజల్.. ----మాధవరావు కోరుప్రోలు.

గజల్.. ----మాధవరావు కోరుప్రోలు.


గజల్.. 

మౌననదిగా సాగిపో..బ్రతుకవచ్చు హాయిగా..!
ఉన్నది కలల తోటలో..నవ్వవచ్చు హాయిగా..!

కరిగిపోయిన గతముతో..ఎందుకోమరి యాతన..
మనము చక్కగ ఒక్కటై..ఆడవచ్చు హాయిగా..!

కాకులొకటై తినునుగా..నాల్గు మెతుకులు దొరికిన..
సత్యమేదో తెలిసెనా..పంచవచ్చు హాయిగా..!

యుద్ధమెందుకు మనసుతో..ఆలోచన నిలుపవా..
నీ హృదయమే ఆలయం..చేరవచ్చు హాయిగా..!

శ్వాసనేలు చైతన్యమే..మాతృత్వపు ఊటలే..
నిత్యస్నేహ వాహినిగా..మారవచ్చు హాయిగా..!

భీభత్సపు వేడుకలో..సరిహద్దులు మిగిలెనా..
అసలు జ్ఞాన మధువేదో..గ్రోలవచ్చు హాయిగా..!

మనుషులెపుడు మానేరో..జీవహింస మాధవా..
ఈ పుడమిని స్వర్గముగా..మలచవచ్చు హాయిగా..! 

రచన: మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్. 
ఫోన్ :9866995085. 0/Post a Comment/Comments