"శుభప్రదమాసం - శ్రావణమాసం" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

"శుభప్రదమాసం - శ్రావణమాసం" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

శుభప్రదమాసం - శ్రావణమాసం

సర్వ జనులు
పరమ పవిత్రంగా భావించి
భగవదారాధనలో
శివకేశవ భేదం లేక
నియమ నిష్ఠలతో పూజించే
దివ్యమైన మాసం
మహిళలు పవిత్రంగా
వరాలిచ్చే వరలక్ష్మిమిని
ఆరాధించే నభోమాసం
శ్రావణ మాసంలో చేపట్టే
శుభకార్యాలన్నీ ఫలప్రదం
అవుతాయన్న ప్రజల నమ్మకం
శ్రీ వేంకటేశ్వరుడు జన్మించిన
శ్రావణ నక్షత్రం పేరుతోగల
పరమ పవిత్ర మాసం
పాల సముద్ర మథనంలో
ఉద్భవించిన హాలా హలాన్ని
పరమ శివుడు సేవించి
నీలకంఠుడై లోకాన్ని
ఉద్ధరించిన మాసం
శ్రావణ మాసం


ఆచార్య ఎం.రామనాథం నాయుడు , మైసూరు
+91 8762357996

0/Post a Comment/Comments