పాకాల యశోదా రెడ్డి - మార్గం కృష్ణమూర్తి

పాకాల యశోదా రెడ్డి - మార్గం కృష్ణమూర్తి


- మార్గం కృష్ణమూర్తి

అంశం: పాకాల యశోదా రెడ్డి
ప్రక్రియ: మణిపూసలు

చక్కటి విద్యా వేత్త
ప్రావీణ్యతగల వక్త
వ్యాసకర్తనే కాదు 
కావ్యాల, గ్రంధకర్త!

యశోద, సరస్వతమ్మల
గౌరవ కాశీ రెడ్డిల
పుత్రికగ జన్మించింది
గ్రామం బిజినేపల్లిల!

బహుభాష కోవిదురాలు
చైతన్యావంతు రాలు
సాహితీ వేత్తయూ
గొప్ప పరిశోధకు రాలు!

భర్త  కళాకారులు
ప్రముఖ చిత్రకారులు
తిరుమల రెడ్డి గారు
అన్యోన్య దంపతులు!

వందకుపైగా రచనలు
అందునెన్నొ ముద్రితాలు
మావూరి మచ్చట్లతో 
రచించె ఎచ్చమ్మ కథలు!

గొప్ప అనువాదకురాలు
డాక్టరేటు , స్వీకర్తలు
సహరచయిత్రికూడా
గ్రంధ పీఠికా కర్తలు!

మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments