కవిత : స్వాతంత్ర దినోత్సవ కవిత 'స్వేచ్చా సమానత్వం' -- D. శ్రీనివాసులు

కవిత : స్వాతంత్ర దినోత్సవ కవిత 'స్వేచ్చా సమానత్వం' -- D. శ్రీనివాసులు

// స్వేచ్చా సమానత్వం //
  
 అస్తమిస్తున్న సూరీడు తిరిగి ఉదయించేందుకు సిద్దమవుతున్న తరుణం.

చిమ్మ చీకటి లో మిణుగురులువలే స్వాతంత్రపు కాంక్ష తో చీకటి ఫై యుద్దాన్ని గెలుస్తున్న సంధర్భం.

పడగలు విప్పి భారతీయుని ఫై బుసలు గొడుతున్న పరాయి మూకల పై విజయం వరిస్తున్న తరుణం.

 బానిస బతుకులు భారమై స్వేచ్చా, సమానత్వం కోసం సాగిలబడి సమరం సాగిస్తున్న సమయం.

 స్వేచ్ఛ భారతావని లో విహరించడం కోసం విజయ ఢంకా మ్రోగించాం.

 సమానత్వపు కాగడాలతో ప్రతి ఊరు తిరిగాం.

 అలుముకున్న అజ్ఞానాన్ని అణిచి విజ్ఞానం వైపు అడుగులు వేశాం.

 మన జీవితాలని మనమే రచించుకున్నాం. 

భారత జాతి విముక్తి కోసం విరామం లేకుండా అహింసా నాదంతో కదం తొక్కాం.

ఈ స్వాతంత్ర సమరం లో  రాలిన కుసుమాలు ఎందరో అందరికి అంజలి ఘటించాం. 

వారు చూపిన బాట లో అడుగులు వేద్దాం, జాతి సమైక్యతనికాపాడుకుందాం.

ఈ స్వాతంత్ర దినోత్సవాన అసమానతలని రూపుమాపుదాం. 

ఆర్థిక పురోగతి కి అందరికి సమాన అవకాశాలని కల్పిద్దాం.
             D. శ్రీనివాసులు 
           నల్లసింగయ్య గారి పల్లి 
             అనంతపురం

0/Post a Comment/Comments