అమ్మ లేదనుకోవద్దు! --D శ్రీనివాసులు

అమ్మ లేదనుకోవద్దు! --D శ్రీనివాసులు

అమ్మ లేదనుకోవద్దు!

అమ్మ ప్రతిరూపంలో దాగి దోబూచులాడె ఈ అక్క రూపాన్ని మరువద్దు !!
నాన్న లేడు అనుకోవద్దు !
నాన్న బాధ్యతలని భుజస్కంధాల మీదే మోస్తున్న ఈ అన్న ని మరువద్దు !
తోడబుట్టిన వాళ్ల కన్నా మించిన సంతోషం! 
ఎక్కడ వెతికినా దొరకని సరాగాల సాహిత్యం !!
బుడి బుడి అడుగులు గజ్జెల చప్పుళ్ళని చూసి మురిసిన అన్న !
ఆపద వస్తే అర నిమిషంలో వాలే నీ అన్న !!
ఆకలి వేస్తే అమ్మతనం గుర్తుకు వచ్చి ని లాలన చూసే అక్క !
ఎన్ని జన్మలయిన  ఒకరి వెనక ఒకరు పుట్టాలి  అనుకునేది  ఈ అక్క !!
నీకు గోరు ముద్దలు తినిపిస్తున్న క్షణాలు !
ఆకలి తీరి హాయిగా ఉన్న చెల్లిసంతోషాలు !
మరుపు రాని మరుగు పడని తీపి జ్ఞాపకాలు!!

                 D శ్రీనివాసులు
                  నల్లసింగయ్య గారి పల్లి
                  అనంతపురం 

0/Post a Comment/Comments