eMail చేయడం ఎలా? --రాజేంద్ర, ఎడిటర్, ప్రవాహిని - అంతర్జాల సాహిత్య పత్రిక.

eMail చేయడం ఎలా? --రాజేంద్ర, ఎడిటర్, ప్రవాహిని - అంతర్జాల సాహిత్య పత్రిక.

eMail చేయడం ఎలా? 


ఇమెయిల్ పంపడంకోసం మనకు చాలా ప్లాట్ ఫార్మ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో మనం ఇప్పుడు Gmail  ద్వారా ఇమెయిల్ పంపడం గురించి తెలుసుకుందాం.




Google Account:


Gmail ద్వారా Email పంపాలంటే తప్పకుండా Google Account వుండాలి. Google Account అంటే మరేదో కాదు Gmail ID (మెయిల్ ఐడి). 




Gmail ID:


ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడే ప్రతివారికి మెయిల్ ఐడి వుంటుంది. లేదంటే “Gmail ID” ని Create చేసుకోవాలి.




Gmail App:


దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్ లలో “Gmail App” మెయిల్ ఐడి తో Login అయివుంటుంది. ఒకవేళ లేకపోతే గనక Google Play Store నుండి Gmail App ని Download చేసుకుని Install చేసుకోవాలి. తదుపరి మీ Gmail ID మరియు Password తో అందులో Login  అవ్వాలి.



How to send Gmail via Gmail App:


ఇమెయిల్ ని Browser / IOS / Android (Computer / iPhone / AndroidPhone) ల ద్వారా పంపవచ్చు. ఇప్పుడు Android Phone లోని Gmail App ద్వారా eMail పంపడం ఎలానో చూద్దాం. ఐతే ఇది చాలా సులభం కూడా.


మీ మొబైల్ లో గల ఈ Gmail App ఐకాన్ పై టచ్ చేయండి.


Gmail App ఐకాన్ పై టచ్ చేయగానే ఈ కింది విధంగా App ఓపెన్ అవుతుంది. 





Compose అని వున్నచోట తాకండి.


Compose అని వున్నచోట తాకగానే ఈ కింది విధంగా ఓపెన్ అవుతుంది. 



Gmail ఓపెన్ చేసాక ఎక్కడెక్కడ ఎమేమ్ రాయాలో కింది వివరాల్లో గమనిద్దాం



 From:  ఇక్కడ మీయొక్క eMail ID డిఫాల్ట్ గా Login అయివుంటుంది.   

             లేదంటే మీ జిమెయిల్ ఐడి మరియు పాస్ వర్డ్ తో లాగిన్ అవండి.

 

To: ఇక్కడ Recipient యొక్క మెయిల్ ఐడి రాయాలి. మీరు ఎవరికైతే పంపాలనుకుంటారో వారి మెయిల్ ID రాయాలి. (ఆన్లైన్ లో ప్రవాహిని   వెబ్సైటు       నందు రచనలు పంపాలనుకునే వారు మేము పంపే eMail ఐడి ఇక్కడ రాయాలి)



Subject:  ఇక్కడ  మీ రచన యొక్క శీర్షిక మరియు మీ యొక్క పేరు రాయాలి. (శీర్షిక పేరు, నాయొక్క పేరు అని మాత్రం రాయొద్దు)


 

Compose email:  ఇందులో మీ ఫోటో మరియు Text రూపంలో మీ రచన  రాయాలి. 


  1. మీ ఫోటో అప్లోడ్ చేయాలి.
  2. మీ రచన యొక్క శీర్షిక పేరు రాయాలి.
  3. మీ రచనను టెక్స్ట్ రూపంలో రాయాలి.
  4. మీ పేరు మరియు మీ గురించి చెప్పాలనుకుంటే మీ యొక్క సంక్షిప్త వివరాలు రాయండి. 
  5. మెయిల్ compose పూర్తయ్యాక ఇక సెండ్ చెయ్యడమే తరువాయి.


ఇక్కడ తాకగానే క్రింది రెండు ఆప్షన్స్ వస్తాయి. వాటినుండి ఏదో ఒకటి  ఎంచుకొని మీరు పంపాలనుకునే మీ ఫోటోని అప్లోడ్ చేయాలి.


  1. Attach file: మొబైల్ యొక్క ఇంటర్నల్(ఫోన్) మెమోరీ మరియు ఎక్స్టర్నల్(మెమోరీ కార్డు) మెమోరీ ఏది ఎంపిక చేసుకుంటే అది ఓపెన్ అవుతుంది.
  2. Insert from Drive: మీ Google Drive లో గల సమాచారము ఫొటోస్ మరియు ఇతరములు అందులో వున్నవి ఓపెన్ అవుతాయి.

పై వాటిల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకుని అందులో నుండి మీ ఫోటో ఎంపిక చేసుకుని Compose email లో అప్లోడ్ చేయాలి.




           Compose email పూర్తయ్యాక పైన కుడివైపుగా వున్న Send బటన్ నొక్కితే eMail పంపడం పూర్తయ్యినట్టే. 




పైన కుడివైపు మూలన వుండే ఈ మూడు చుక్కలను తాకితే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అవి అంతగా అవసరముండదు. ఒకవేళ అవసరమనిపిస్తే వాడుకోవచ్చు.









0/Post a Comment/Comments