స్వాతంత్ర్య సమర చిహ్నాలు --E.V.V.S. వర ప్రసాద్

స్వాతంత్ర్య సమర చిహ్నాలు --E.V.V.S. వర ప్రసాద్

E.V.V.S. వర ప్రసాద్


 స్వాతంత్ర్య సమర చిహ్నాలు

అదిగో చూడర!
అలనీలి గగనాన
త్రివర్ణ పతాక రెపరెపలు!

అదిగో కనరా!
అలనాటి భారత
స్వాతంత్ర్య పోరాట ఘంటికలు!

వినబడలేదా?
జైహింద్ అంటూ...
జైళ్లకు వెళ్లిన జనవాహిని వంటిని
తాకిన లాఠీ దెబ్బల సవ్వడులు?

కనబడలేదా?
రక్తపు ధారల 
అసువులు బాసిన
భారత వాసుల చారికలు..?

వినబడలేదా ?
ఇంక్విలాబ్ జిందాబాద్ 
అని నినదించిన మన
దేశ భక్తుల గొంతుకలు..?

కనబడ లేదా ?
భారత దాస్యపు 
శృంఖలాలు తెగతెంపగ 
నడిచిన నాయకుల పథ చిహ్నాలు..?

పాడుటలేదా?
వందే మాతరమంటూ...
వారందించిన భారత
స్వేచ్ఛా గీతికలు..?

పలకగలేవా?
జనగణమన మంటూ...
జాతి ఐక్యతకు రూపునిచ్చిన
జాతి నేతలకు జేజేలు..?

( 75 సంవత్సరాల వజ్రోత్సవ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా నా స్వీయ రచన )

✍️ రచన
 *E.V.V.S. వర ప్రసాద్,*  
తెలుగు ఉపాధ్యాయుడు,
ఊరు : తుని.
జిల్లా : తూర్పు గోదావరి
చరవాణి : 8019231180

0/Post a Comment/Comments