కడలి కల్పతరువుlll- మార్గం కృష్ణమూర్తి

కడలి కల్పతరువుlll- మార్గం కృష్ణమూర్తి


కడలి కల్పతరువు

వాగులు, వంకలు
నదులు ,కాలువలు
ఆకాశాన మేఘాల నుండి జాలువారే నీటి ధారలు
పుడమి అడుగున ఊరే అమృత ధారలు
పిలవని పేరంటంలా నీ ఒడిన చేరు
విశాలహృదయం నీది, అన్నిటిని ఆదరిస్తావు
అక్కున చేర్చుకుంటుంటావు!

అమావాస్య పౌర్ణమికి వచ్చే ఆటు పోట్లకు
అదరవు బెదరవు , అలిగి మూలకుండవు
కన్న తల్లిలా చంటి పిల్లలను సాకినట్లు
నదులు వాగులు వంకల సాకుతావు!

జల కళను కాపాడుతావు
వృక్ష సంపదను వృద్ధి చేస్తావు
భూ గర్భ సంపదకు మేలు చేస్తావు
పక్షి జాతిని పిలిచి రక్షిస్తావు
పర్యావరణాన్ని పరి రక్షిస్తావు!

దేశాల మధ్య విభేదాలు రాకుండా రక్షణగా
వర్తక వ్యాపారాలు చేయడానికి అనుకువగా
జాలరులు జీవనోపాదికి ఉపయుక్తముగా
లవణ,వజ్ర వైడూర్యాలు సేకరణకు వీలుగా!

అందాల కడలివి నీవు
ఆనందాల హరివిల్లువు నీవు
అంతుచిక్కనివ్వని భూగర్భం నీవు
అలసి సొలసి పోవు ఎన్నటికి నీవు
సృష్టితోనే ఉద్భవించిన కడలివి నీవు
ప్రపంచ జీవకోటికి కల్పతరువువు నీవు

మార్గం కృష్ణమూర్తి
హైదరాబాద్
0/Post a Comment/Comments