మురిపాల విన్నపాలుlll డా.రామక కృష్ణమూర్తి

మురిపాల విన్నపాలుlll డా.రామక కృష్ణమూర్తి

మురిపాల విన్నపాలు
డా.రామక కృష్ణమూర్తి

అరుణకిరణమా....
నీ స్నేహంతో నన్ను గెలిచావు.
నీ ప్రేమతో ప్రాణమయ్యావు.
నీ మాటలతో మమత పంచావు.
నీ సహనంతో నన్ను కట్టిపడేసావు.
నీ సర్వస్వాన్ని అర్పించి
నాదానివయ్యావు.
ఏమిచ్చి తీర్చుకోను నీ ఋణం?
ప్రతిజన్మలో నీకై పుట్టి
నీసేవ చేసుకుంటా!
నీ ప్రేమతో పూర్తిగా నన్ను దోచుకున్నావు.
ప్రతిక్షణం నీ మాట,చూపులే
నా శ్వాసై నడిపిస్తున్నాయి.
నీవిచ్చిన‌ ఆనందం,
నీవిచ్చిన‌ ధైర్యం,
నీ చిరుదరహాసం, 
మరపునకు రావు.
జానూ!నీ ఒడే నాకు శాశ్వత నివాసమవ్వాలి.
నులివెచ్చని‌ మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే కాలాన్ని‌ ఆపేయాలి.
ప్రకృతి పరవశమో
నీ వశమో,
ఈ మనసు అల్లరి చేస్తుంది.
హృదయం సవ్వడి చేస్తూ
రాగాలు తీస్తుంది.
గాలి గమనం మార్చి,
సలిలారుణమై తాకుతున్నది.
మేను పులకించి,
నయనాలు ఉన్మీలనమవుతున్నాయి.


0/Post a Comment/Comments