అభివృద్ధి vs సంక్షేమం

అభివృద్ధి vs సంక్షేమం


- మార్గం కృష్ణ మూర్తి

అభివృద్ధి Vs సంక్షేమం

అభివృద్ధి అంటే
కాదు ఆకాశ హార్మ్యాలు
కాదు ఫ్యాక్టరీలు పరిశ్రమలు
కాదు బంగారు నిల్వలు
కాదు నల్లధన నిల్వలు
కాదు డిస్కో డ్యాన్సులు!

అభివృద్ధి అంటే
మానవ వనరుల అభివృద్ది
పర్యావరణ పరిరక్షణ
ఆచార సాంప్రదాయాల పరిరక్షణ
సంస్కృతి కళల అభివృద్ధి
కనీస కూడు గూడు గుడ్డ
విద్య , వైద్యం అందరికి లభించడం
ఆకలి కేకలు వినబడక పోవడం
పల్లెలను పట్టణాలుగా తీర్చి దిద్దడం
అవినీతి లేకుండా ఉండటం
దోపిడి తత్వం లేకుండా ఉండటం
ఆత్మాభిమానానికి రక్షణ ఉండటం
స్వేచ్ఛగా బ్రతుక గలగడం!

సంక్షేమం అంటే
నిరు పేదలకు , వికలాంగులకు , వృద్ధులకు
కనీస కూడు ,గూడు , విద్య వైద్యం
ఉచితంగా అందించడం
ఉపాది కల్పించడం
ఉచితమంటే యువతరాన్ని
సోమరులను చేయడం కాదు
చవటలను చేయడం కాదు
బిక్షకులను చేయడం కాదు
బానిసలను చేయడం కాదు
ఉపాధి కల్పించాలి
ఉన్నతంగా తీర్చి దిద్దాలి
వారిలోని కళలను అభివృద్ధి చేయాలి!

మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments