ఆస్తులు లేనట్టి
గొప్ప నిరాడంబరుడు
వివక్షత ఎక్కడున్నా
వ్యతిరేకించిన వాడు
నిత్యం ఉద్యమాలతోనే
ఉనికి చాటుకున్నవాడు
తాడిత పీడిత ప్రజల
గుండెల్లో ఉన్నవాడు
కవితలతో ప్రజాకవిగ
పేరొందిన వాడు
వారెవ్వా! సమాజ గొడవే
నా గొడవ అన్నవాడు
అన్యాయమెక్కడున్నా
ఎదిరించిన వాడు
రజాకార్లకు ఎదురేగి
జైలులో ఉన్నవాడు
వహ్వా! తనకోసం కాకుండా
ఇతరులకై బ్రతికినవాడు
వ్యవహారిక భాషకు
ప్రాణమిచ్చినవాడు
తెలంగాణ యాసకు
గుర్తింపు ఇచ్చినవాడు
ఇంకా మంచి ఎక్కడున్నా
హాయిగా స్వాగతించినవాడు
వ్యక్తిత్వం స్వేచ్ఛలను
వదులుకోవద్దన్నాడు
తాను చెప్పినదే సదా
ఆచరించినవాడు
ఇంకెవరు కాళోజీ మన
తెలంగాణ వైతాళికుడు.
వి.టి.ఆర్. మోహనరావు,
09-09-2021, పాల్వంచ.