శీర్షిక: కదిలించిన కాళోజీ. --యం. బాబు,10వ, తరగతి, దుప్పల్లి,

శీర్షిక: కదిలించిన కాళోజీ. --యం. బాబు,10వ, తరగతి, దుప్పల్లి,

 శీర్షిక: కదిలించిన కాళోజీ

కాళోజీ కవిత్వం
సమాజ చైతన్యం
అదెపుడు నిత్యనూతనం
మనిషిలో దాగిన
మనీషిని మేల్కొల్పె నవ్యత్వం
సమాజాన్ని సహజంగా
సోయిదప్పిన మనిషిని
వెనకబడిన తెలంగాణ అస్థిత్వాన్ని అనునిత్యం
ఎరుకపరుస్తూ ఏకరువెట్టాడు
అన్యాయమెక్కడుంటే
ఆ కవిత్వం
అక్కడే మొలకెత్తుంది
సమాజాన్ని కడిగేస్తుంది
ఆకలికి జరిగే
అన్యాయాల్ని ఎండగట్టిన
మానవతావాది
భాషనెంతో ప్రేమించి
పరభాషల వ్యామోహాన్ని
దునుమాడాడు
మనిషై పుట్టీనోడు
దేశానికంకితమవ్వాలన్నాడు


యం. బాబు,
10వ, తరగతి,
దుప్పల్లి,


0/Post a Comment/Comments