శ్రీమతి కల్పన దేవసాని గారికి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ పురస్కారం 2021

శ్రీమతి కల్పన దేవసాని గారికి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ పురస్కారం 2021

2021 డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ పురస్కార గ్రహీత కల్పన దేవసాని గారు

శ్రీమతి కల్పన దేవసాని గారికి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ పురస్కారం 2021 

కామారెడ్డి జిల్లా బాన్సువాడ  పట్టణానికి చెందిన శ్రీమతి కల్పన దేవసాని గారిని డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ పురస్కారం 2021 వరించింది.  ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్న కల్పన గారు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు క్యాంపు కార్యాలయం హైదారాబాద్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ పుస్కారాన్ని అందుకున్నారు.  

పుడమి సాహితి సంస్థ - తెలంగాణ వారు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంది. ఈ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 35 మందిని ఎంపిక చేసి సంస్థ అధ్యక్షులు  డా. చిలుముల బాల్ రెడ్డి గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు క్యాంపు కార్యాలయం హైదారాబాద్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో వారిని మాజీ టి.టి.డి. ఈ.ఓ., ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు శ్రీ కె. వి. రమణాచారి, ఐ.ఏ.ఎస్. గారి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ అపురూపమైన కార్యక్రమంలో శ్రీమతి కల్పన దేవసాని గారిని సన్మానించి, రమణాచారి గారు ఆశీస్సులు అంద చేసారు. 

ఈ సందర్భంగా పురస్కార గ్రహీత కల్పన గారు మాట్లాడుతూ  తన సేవలు గుర్తించి ఈ సువర్ణ అవకాశం కల్పించిన పుడమి సాహితీ వేదిక వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళారత్న బిక్కి కృష్ణ, ప్రముఖ కవి, రచయిత  డా. మహమ్మద్ హసేనా, ఆత్మీయ భారతి సాహితీ సేవాసంస్థ అధ్యక్షులు వాకిటి రాంరెడ్డి, ప్రముఖ కవి, నవలా  రచయిత నర్రా ప్రవీణ్ రెడ్డి, బూరుగు గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అటు ఉపాధ్యాయినిగా ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ, సాహితీ సేవారంగంలో తనదైన ప్రతిభతో ముందుకు దూసుకుపోతున్న కల్పన గారి విశిష్ట సేవల్ని  సహోద్యోగులతో పాటు, ఇతర సాహితీ సంస్థల ప్రతినిధులు ఎంతగానో కొనియాడారు.

ఈ సందర్భంగా శ్రీమతి దేవసాని కల్పన గారికి ప్రవాహిని పక్షాన ప్రత్యేక శుభాకాంక్షలు. వారు ఉద్యోగ, సాహితీ రంగాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.

-- రాజేంద్ర, ఎడిటర్, 
ప్రవాహిని - అంతర్జాల సాహిత్య పత్రిక.

0/Post a Comment/Comments