75 భారతం శ్రీమతి సత్య మొం డ్రేటి

75 భారతం శ్రీమతి సత్య మొం డ్రేటి

అజాది కా అమృత మహోత్సవం
75 ఏళ్ల స్వాతంత్రం
--సత్య మొం డ్రేటి

మహాత్మా గాంధీ నాయకత్వాన స్వాతంత్ర్య ము సంపాదించిన భారతదేశం రెండు రకాల పరిపాలనా ప్రాంతాలుగా ఉండేది .ప్రత్యక్షంగా బ్రిటిష్ పాలనలో ఉండే భాగం భూభాగం మొదటిది, బ్రిటన్ రాచరికానికి లోబడి ఉంటూ అంతర్గత వ్యవహారాల నియంత్రించుకునే సంస్థానాలు రెండోది.

ఈ సంస్థానాలు మొత్తం 562 ఉన్నాయి. ఈ సంస్థానాలకు బ్రిటిష్ వారితో వివిధ రకాలైన ఆదాయ భాగస్వామి ఏర్పాట్లు ఉండేవి .వాటి పరిమాణం జనాభా స్థానిక పరిస్థితులను బట్టి ఈ ఆదాయ పంపకాలు ఏర్పాటు ఉండేది. ప్రాన్స్ పోర్చుగల్లో నియంత్రణలో ఉండే అనేక వలస ప్రాంతాలు కూడా ఉండేవి .ఈ కాలంలో భారత దేశంలో రాజకీయంగా ఏకీకృతం చేయడం భారత జాతీయ కాంగ్రెస్ ప్రకటించిన లక్ష్యం భారత ప్రభుత్వం దీనిని అమలు పరిచింది .వివిధ పద్ధతుల ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యేందుకు ఒప్పించారు.

భారతదేశం ప్రపంచ దేశాలలో 120 కోట్లకు పైగా జనాభా తో రెండో స్థానంలో వైశాల్యంలో ఏడవ స్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్య దేశం. 

ఇది 29 పార్లమెంట్ 28 29 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగి పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించు అనే ఒక సమాఖ్య. 

దక్షిణ ఆసియా లో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి భారత ఉపఖండము లో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాల తో ఉపఖండం గా విరాజిల్లుతుంది.

పాకిస్థాన్,చైనా,మయన్మార్,బంగ్లాదేశ్,నేపాల్,భూటాన్,ఆఫ్గనిస్తాన్ దేశాలు సరిహద్దులు.

శ్రీలంక ,మాల్దీవులు ఇండోనేసియా దగ్గరలో వున్న ద్వీపదేశాలు. ఇది సింధు లోయ నాగరికతకు పుట్టిల్లు. 

హిందూ మతము బౌద్ధ మతము జైన మతము సిక్కు మతము లకు జన్మనిచ్చింది.

ఇది బహుభాషా బహుళజాతి సంఘం ఇది వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశం..

దేశ నినాదం"" సత్యమేవ జయతే ""
గీతం ""జనగణమన""
జాతీయ గీతం ""వందేమాతరం""
దేశ రాజధాని కొత్త ఢిల్లీ
అధికార భాషలు హిందీ ఇంగ్లీష్
అహింసాయుత పోరాటం తర్వాత 1947 లో ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది

1991లో మార్కెట్ ఆధారిత ఆర్థిక సంస్కరణలు అనుసరిస్తూ భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటి అయింది ఇప్పటికీ పేదరికం నిరక్షరాస్యత అవినీతి పోషకాహార లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉంది.

స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో అసాధ్యమనుకున్న కొన్ని లక్ష్యాలను సాధ్యం చేసినందుకు కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రధానమంత్రి ఆజాది కా అమృతోత్సవం  అంగరంగ వైభవంగా ప్రకటించారు…

స్వాతంత్ర పోరాటం 75 ఏళ్ల ఆదర్శాలు 75 ఏళ్ల విజయాలు 75 ఏళ్ల కార్యాచరణ 75 ఏళ్ల సంకల్పం అనే అయిదు భాగా లు కింద విభజించారు 75 వారాలు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఉత్సవాలకు ఏర్పాట్లు 130 కోట్ల భారతీయుల ఆకాంక్షలు ఆలోచనలు భావనలు కేంద్రంగా అన్నారు... 75 భారత సంవత్సరాల భారత స్వాతంత్రం లో అనేక విజయాలు సాధించారు. కొన్ని సమస్యలు పరిష్కారం కానప్పటికీ భారత ప్రజల స్వతంత్ర దేశంలో స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతున్నారు…

ఆర్థిక రంగంలో విద్యా రంగంలో సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధించారు.......
శత సంవత్సర ఉత్సవానికి అగ్రరాజ్యాల దరిచేరి ప్రపంచ దేశాలకే అగ్రరాజ్యంగా నిలుస్తుందని ఆశిస్తున్నారు భారతీయులు.... వందేమాతరం మా తుజే సలాం
భారత్  మాతకు జై...

0/Post a Comment/Comments