నేడు తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కొమురం భీమ్ 81 వ వర్థంతి సందర్భంగా 'గోండు వీరుడు..కొమురం భీముడు..! --సుజాత.పి.వి.ఎల్, సైనిక్ పురి, సికిందరాబాద్.

నేడు తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కొమురం భీమ్ 81 వ వర్థంతి సందర్భంగా 'గోండు వీరుడు..కొమురం భీముడు..! --సుజాత.పి.వి.ఎల్, సైనిక్ పురి, సికిందరాబాద్.

నేడు తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కొమురం భీమ్ 81 వ వర్థంతి సందర్భంగా 


'గోండు వీరుడు..కొమురం భీముడు..! 

ఆదివాసీయుల ఆశాజ్యోతి..
అమాయక గోండుల  తెలంగాణ విప్లవ కెరటం...
నిరంకుశ నిజామ్ దురంతాలని ఎదిరించిన
గండర గండుడు..
ఆదివాసులకి అడవులపై హక్కులుండాలని నినదించిన శూరుడు..అరణ్య వీరుడు..
తన జాతి కోసం ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పోరాడిన ధీరుడు...
ఆదివాసి గోండులని చైతన్యపరచి
'జల్ జంగల్ జమీన్' పోరుబాటపట్టి..
తెల్ల దొరలను నిలువెల్లా వణికించిన గోండు వీరుడు..
తన కళ్ళముందే జాతికి జరుగుతున్న
అన్యాయాన్ని చూసి సహించలేక..
ఆయుధం పట్టిన విప్లవాగ్ని...
బలమైన శత్రువుతో హోరాహోరీగా ఢీకొన్న బడబాగ్ని...
గెలుపుపై ఆశలు లేకున్నా,
చివరి వరకు పోరాడి అమరుడై..
ఆదివాసీ గుండెల్లో కొలువైన  దేవుడు..
బాబేఝరి, జోడేఘాట్ ప్రాంతాలలో వెల్లివిరిసిన విప్లవ చైతన్యం...
ప్రవహించే వేడి రుధిరం..
ఇప్పటికీ, ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయిన జ్వాలాగ్ని..
తన జాతిని ప్రాణత్యాగంతో ..
ప్రపంచ చరిత్రలో లిఖించిన మహోన్నతుడు..!
కొమరం భీమ్..!!

--సుజాత.పి.వి.ఎల్,

సైనిక్ పురి, సికిందరాబాద్.


0/Post a Comment/Comments