పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు --డా. విడి రాజగోపాల్

పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు --డా. విడి రాజగోపాల్



పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు

( ఆత్రేయ గారి వర్ధంతి  సందర్భంగా)

ఏమని రాయను ఏమని రాయను
ఎన్నని రాయను ఎన్నని రాయను
ఆ వాగ్దేవి రోజూ పలికిస్తూనే ఉంది
ఆ పలుకే నాలుగు రూకలిస్తూ
ఈ జీవన తరంగాలలో గమ్యం చేరుస్తుంది
అనుకుంటూ  బృందావన్ గార్డెన్ లో
ఓ డ్యూయట్ రాయాలని ప్రయత్నం
ఆకాశంలో చూశాడు
శూన్యంలో కాసేపు
అన్నాడు ఓ కవి మిత్రుడు కదా అని
ఇంతలో ఆకాశం మబ్బు పట్టి
చిట పట చినుకులు రాలటం

చిట పటచినుకులు పడుతూ ఉంటే
చెలికాడే సరసన ఉంటే
అంటూ పల్లవి పలకరించింది
ఇక పెన్ను ఆగలేదు
ఓ పాట వచ్చింది
అది బృందావనంలో
ఆత్రేయ గారి అనుభవమట

మూగమనసులు సినిమాలో ఆయన పాట మన నోట వినిపిస్తాడు... పాడుతా  తియ్యగా అంటూ ..... తన విశ్వరూపం చూపించాడు... "పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు...ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు " అంటూ చక్కని వేదాంతం చెబుతాడు

కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల
పసిడిదాన  అంటూ మేడల్లో కులికే ఓ దొరసానికి తన కులుకులకు కారణమెవరో ఎంత చక్కగా వివరిస్తారో శ్రామికుల గురించి..ఇది శ్రీ శ్రీ మార్కు పాట...ఒక పల్లవి చూద్దాం...

"చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా,మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా,కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచిగనులు తొలిచి,చమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో!
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా,చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు,
చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో.....

ఈ వీణకు శృతిలేదు...ఎందరికో హృదయం లేదూ...అంటూ దగా పడ్డ ఓ అమాయకురాలిచే ...నా ప్రశ్నకు బదు లేది అని ఆవేదనతో సంఘం పై విరుచుకు  పడతాడు

తెల్లచీర కట్టినా మల్లె పూలు పెట్టినా
కల్లకపటమెరుగని మనసుకోసం అంటాడు, ఈ మనసుకవి,

ఫలించని ప్రేమల ఆవేదన మన ఆత్రేయ కలంనుండే వినాలి

"నేనోక ప్రేమ పిపాపసిని...అంటూ
"తలుపు మూసిన తలవాకిటనే నుంచున్నా పగలూరేయి ...పిలిచి పిలిచి బదులేరాక ...అలసి తిరిగి వెడుతున్నా" అంటూ భగ్నప్రేమికుని ఆవేదన పలికించి జాతీయ అవార్డు తెచ్చుకున్నారు

"ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం"...అదే నీవు అదే నెను అదే గీతం పాడనా" ..అంటూ అభినందన సినిమా లో అన్నీ సాహితీ ముత్యాలే

"మనసు గతి ఇంతే మనిషి బ్రతుకంతే" అంటూ ప్రేమనగర్ సినిమా తెరవెనుక హీరో ఆత్రేయే అని పించుకున్నారు

తేట తేట తెలుగులా ....అంటూ మన తెలుగు భాషను ఓ అందమైన కన్నె పిల్లగా పోల్చటం...వీరికే చెల్లు

అయితే సినిమాకు గరం మసాలా పాటలు కావాలి కదా!

కడవెత్తు కొచ్చిన ఓ కన్నె పిల్లను
కాడెత్తుకొచ్చిన ఓ బుల్లోన్ని సరదాగా కలుపుతాడు

పచ్చగడ్డి కోసేటి పడచు పిల్లను పలకరిస్తాడు

ఇందులో శృతి మించినవీ ఉన్నాయి...
అవి నిర్మాతాలు ధనదాహార్తి కోసం రాసినవేగానీ శృతి తప్పిన రాగాలు కాదు సుమా!

వీణపాటరాసినా,
అమ్మ పాట రాసినా,
పల్లె పడచు పాట రాసినా,
ప్రేమ పాట రాసిన,
మససు పాట రాసినా
అన్నీ అందమైన పాటలే
మనసుకు హత్తుకునే పాటలే

మనసా కవ్వించకే నన్నిలా...
ఇప్పటికే పరిధి దాటింది....
ముగింపు పలకాలి...

ఆత్రేయ వర్దంతి సందర్భంగా వారిని స్మరించుకొంటూ....

డా.విడి రాజగోపాల్
సెల్: 9505690690



 

0/Post a Comment/Comments