శీర్షిక: కాలం చేతిలో కీలు బొమ్మలం
కాలం ఎవ్వరినీ ఊరికే వదలదు
కాలానికి మనం బానిసలం
కాలం తిమ్మిని బమ్మి చేస్తుంది
బమ్మిని తిమ్మి చేస్తుంది
పొగరుగా వుండేవాడి
పొగరును అణచివేస్తుంది
పొగరుగా వుండేవాడి
పొగరుతనాన్ని నాశనం చేస్తుంది
అందలం ఎక్కించ గలదు
అందలం పై నుండి దించగలదు
అహాన్ని పెంచగలదు
అహాన్ని తుంచగలదు
నవ్వేవాడిని ఏడిపిస్తుంది
ఏడిచే వాడిని నవ్విస్తుంది
మురిపిస్తుంది మరిపిస్తుంది
కవ్విస్తుంది కాటేస్తుంది
అంతా నాదే అంతా నేనే అనే లోగా
అంతా శూన్యమనిపిస్తుంది
భవబంధాల ఉచ్చులో
ఆశల పల్లకి లో ఉన్న మనం ఎవరికి ఏమి కాదు అని నిరూపిస్తుంది
కాలం గాయం చేయగలదు
కాలం సాయం చేయగలదు
కాలం శిక్షిస్తుంది భక్షిస్తుంది
కాలం కొన్ని సమయాల్లో రక్షిస్తుంది
కాలం తో పోటీ పడకు
కాలం తో ఢీ కొనకు
కాలమే పరిష్కారం
కాలమే భవితకీ సమాధానం
రచన:పసుమర్తి నాగేశ్వరరావు
టీచర్ సాలూరు
విజయనగరం జిల్లా