పీడిత ప్రజాజీవనం -విముక్తి -వి. కృష్ణవేణి

పీడిత ప్రజాజీవనం -విముక్తి -వి. కృష్ణవేణి


బానిస సంకెళ్ళు

పీడిత ప్రజాజీవనం -విముక్తి.

ఎటు చూసిన బానిససంకెళ్ళు..
వృత్తిపరంగా బానిసత్వ
ఉద్యోగరీత్యా బానిసత్వ..
పేదరికంతో బానిసత్వం..
నిరుద్యోగ బానిసత్వం..
కులబానిసత్వం,
మతబానిసత్వం..

ఎటుచూసిన బానిసత్వం.
అంతా బానిసత్వం తప్పా ఏముంది గర్వకారణం..
మగ్గుపోతున్న పీడితప్రజాజీవితం..
బానిససంకెళ్ళతో, పరాయిదేశ పాలన పీడనత్వంతో..
పీడిత జీవనం తప్పా ఏముంది జాతీరక్షణ..
పరాయిపీడుతుల చాటున మగ్గుతూ బ్రతుకుతున్నంత కాలం స్వేచ్చ దొరకదు.

బానిసత్వ విముక్తికై 
స్వయం కృషితో ముందుకు దూసుకుపోవాలని బానిససంకెళ్ళను తెంచుకుని ముందుకు రావాలని..
నవతరాన్ని స్థాపించాలని యువతరాన్ని ప్రోత్సహిస్తూ..
చైతన్యాన్ని రెకెత్తింపచేస్తూ...
అభివృద్ధిమార్గాలవైపు కృషి చేస్తూ..
స్వచ్చంద కార్యక్రమాలను స్థాపిస్తూ పేద, మధ్య, అన్ని తరగతులవారికి సరైన రీతిలో
ప్రభుత్వ పథకాలను అందచేస్తూ..
అన్నింటా ముందుండాలని సూచిస్తూ...
ఆర్థికపరంగా, విద్యాపరంగా ముందుకు దూసుకుపోతూ స్వయంకృషితో ఎదుగుతూ
స్వేచ్చా జీవనాన్ని సాగిస్తూ..
విదేశీ బానిసత్వం నుండి..
యాజమాన్యబానిసత్వం నుండి విముక్తి పొందాలని..
పీడితప్రభావం నుండి తమనుతాము రక్షించుకుంటూ దేశజాతీ గౌరవాన్ని కాపాడుకోవాలని యువతరాన్ని, ప్రతీ పౌరున్ని ప్రోత్సహించిన నాడే బానిసత్వం నుండి విముక్తి లభించి నిజమైన స్వేచ్చను పొందగలం.


వి. కృష్ణవేణి
వాడపాలెం.
9030226222

 
 ప్రక్రియ :వచనం 

0/Post a Comment/Comments