తక్కువ అంచనా వద్దు..!(కవిత)
*******✍🏻విన్నర్******
పనికిరాని వస్తువులు కూడ ఒక్కొక్క మారు ఏదోక విధంగా పనికివస్తాయి,
ఎవ్వరినీ అంచనా వేయలేం..!??
ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ
ఏదోక ప్రత్యేకత,
ఉండి తీరుతుంది..!
మహాకవి కాళిదాసును పిచ్చోడు అన్నారు..!??
కాని ఏమయ్యాడు..!??
అభిజ్ఞాన శాకుంతలం రచించాడు..!
చరిత్రలో నిలిచిపోయాడు..!
ఆడంబరాలు ప్రదర్శించేవారు
పెద్ద పోతుమొనగాళ్ళని నమ్మలేం..!??
అమాయకులైన వారిని తెలివితక్కువ దద్దమ్మలని దూరం పెట్టలేం..!?
ఈ కలికాలంలో చిన్న పిల్లలు సైతం
పెద్ద పెద్ద డిగ్రీలు పొందుచున్నారు..!
కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి
చూపెడుతున్నారు..!?
పిల్లలని చిన్నచూపు చూస్తున్నాం.. కాని,
అద్భుతాలు సృష్టిస్తున్నారు..!??
ఇలా పిల్లల్లో,పెద్దల్లో ప్రతి ఒక్కరిలో ఏదోక సుగుణం ఉంటుందని చెప్పొచ్చేేది.
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.