- మార్గం కృష్ణ మూర్తి
శీర్షిక: అవతార పురుషుడు వామనుడు
ప్రక్రియ: మణి పూసలు
రూపకర్త: శ్రీ వడిచర్ల సత్యం గారు
01.
విశ్వజిత్తు యాగమొందె
మహా బలి విజయం పొందె
అహముతో హింసించగ
సురుల కడ రక్తం చిందె
02.
మనసు నిండా వికలమై
దేవతలంత ఏకమై
మొరపెట్టిరి విష్ణువుకు
ఎంతో ధీన వదనమై
03.
విష్ణుఅవతారపురుషుడు
కోరిక సమ్మతించాడు
ఉపాయం ఆలోచించ
నిర్ణయానికి వచ్చాడు
04.
భాద్రపద శుక్లపక్షము
శుభ ద్వాదశి దినము
అతిది గర్భము నందు
బాల వామనుడు జననము
05.
విష్ణు రూప వామనుండు
మెల్లెగ బలిని చేరాడు
మూడు అడుగుల దానం
కావలెననీ కోరాడు
06.
ఓష్! ఇంతేన బాలకా
ఇదేనా నీ కోరికా
బలి చక్రవర్తి అనే
ఏమిటో చెప్పూయికా
07.
ఉగ్రరూపమును దాల్చెను
ఒకడుగు మహిపై పెట్టెను
పెట్టె రెండవది గగనము
మూడవది తలన పెట్టెను
08.
యిక బలి అంతరించెను
సురులూ సంతసించెను
ఇంద్రుడు, స్వర్గం చేరె
ఋషులు ఆనందించెను
- మార్గం కృష్ణమూర్తి
హైదరాబాద్