శీర్షిక:- గాన గంధర్వ సంగీత సామ్రాట్ *బాలు*
కవి పేరు :- కొల్లూరు వెంకటరమణమూర్తి
ఊరు:- హైదరాబాదు,📱 9966016296
తేదీ:- 25-09-2021
*-: కవిత :-*
వర్ధంతి సందర్భంగా అశ్రునయనాలతో
సమర్పించు చిన్న కవితారూపపు నివాళి
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
బాలూ! నీవెక్కడికీ పోలేదు! బాలూ!
వందలాది బంధువులందు ఉన్నావు!
వేలాదిమంది గళాలగూటిలో ఉన్నావు!
లక్షలాది గుండెల్లో కొలువుదీరి ఉన్నావు!
కోట్లాది అభిమానుల తలపుల్లో ఉన్నావు!
మా అందరి మస్తిష్కాల్లో నిక్షిప్తమై ఉన్నావు!
🎼🎸🎷🪕🪘🎺🎤🎻🥁🪗🎹
శ్రీపతి పండితారాధ్యులింట ఉదయించేవు!
పండితులచే శ్రీకరముగ ఆరాధింపబడ్డావు!
తెలుగువారికెంతో గర్వకారకుడవయ్యావు!
భరతమాతకొక ముద్దు బిడ్డవై కీర్తి నొందేవు!
దేశదేశాలందు అనునిత్యం ప్రకాశిస్తున్నావు!
విశ్వవిఖ్యాతినొందిన గానగంధర్వుడవై నీవు!
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
ఇట్లు
కొల్లూరు వెంకటరమణమూర్తి, హైదరాబాదు