నాన్న కోసం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

నాన్న కోసం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

నాన్న కోసం..!(కవిత)

ఈ రోజు ఏమయ్యింది నాకు..!??
నా కళ్ల నుండి కన్నీళ్ళలా జల జలా రాలుతున్నాయి..!
ఏకంగా కన్నీటి జలపాతం అయిపోయింది,
నా పరిస్థితి..!
ఎన్నెన్నో జ్ఞాపకాలు మదికి సూదిలా గ్రుచ్చుతున్నాయి..!
మదిలోంచి బాధ 
భరించలేనిదిగా ,
దు:ఖం తన్నుకొస్తోంది..!
ఎంతో పశ్చాతాపం ..
మదిలో రగులుతోంది..!
క్షమాపణలు దేవుడితో ఎంత వేడుకున్నానో..!
గతం గాయాలు మనస్సుని అతలాకుతలం చేస్తున్నాయి..!
ఎంత ప్రయత్నించినా..
కన్నీళ్ల ప్రవాహం ఆగడం లేదు..!
ఈ రోజు నాకు హాఠాత్తుగా నాన్న గారు గుర్తుకొచ్చారు..!
ఆయన మహోన్నత వ్యక్తి,
మంచి విలువలు పొంది నలుగురితో 
మంచి అనిపించుకున్న ఆదర్శ ప్రాయుడు..!
సౌమ్యుడు,మంచి వ్యక్తిత్వం సొంతం చేసుకొన్న మహనీయుడు..!
ఎప్పుడూ గుర్తుకు వస్తుంటాడు ..నాన్న..!
ఎన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నా నాన్న లేని బ్రతుకు వ్యర్థం..!
బిడ్డలకు తల్లిదండ్రులే విలువైన సొత్తు..!
కుటుంబం కోసం శ్రమించే నాన్న జీవితం శ్లాఘనీయం..!
ఈ రోజు నాన్న కోసం మనసారా ఏడ్చాను..!
ఇంకెప్పటికి రాని నాన్న కోసం పడిగాపులు కాస్తున్నాను..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments