టీచర్స్ డే --కొల్లూరు వెంకటరమణమూర్తి

టీచర్స్ డే --కొల్లూరు వెంకటరమణమూర్తి


*ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో*  

"టీచర్స్ డే" 

టీచర్ టీచర్ అంటాము!  
టీచర్స్ డే జరుపుతాము! 
వేడుకలెంతగానో చేస్తాము! 
టీచర్నే గౌరవించని మనము! 

సొల్లు కార్చుకుంటాము మనం 
సామాజిక మాధ్యమాల్లో చూసి 
స్టూడెంట్ టీచర్ల ప్రేమాయణాన్ని! 
నిజ జీవితాలకు దాన్నన్వయిస్తాం! 

టీచర్స్ బ్రాండ్ మద్యాన్నాదరిస్తాం!  
జాతినిర్మాతల్నే అవమానిస్తుంటాం!  
మనల్ని మనం కించపరచుకుంటాం! 
మన ప్రగతిని కూలదోసుకుంటున్నాం! 

మరువకూడదు మన మూలాలను 
మన ఔన్నత్యానికి పాటుపడ్డవారిని!  
ఉన్నత పదవులెన్ని అధిరోహించినా 
సమస్త విజయాల మూలాధారాలను!  

తెలుసుకోవాలిప్పటికైనా వారి విలువని! 
తర్వాతి తరాలకందించాలి ఆ సందేశాన్ని!  
తీసుకుపోవాలి ముందుకు జాతి ఉన్నతిని!  
మార్చుకోవాలిక మనమే మన భవితవ్యాన్ని! 

**************************************
ఇట్లు 
కొల్లూరు వెంకటరమణమూర్తి, హైదరాబాదు 
చరవాణి :- 9966016296  
***************************************

0/Post a Comment/Comments