కాలం అనే గుప్పెట్లో కలలు కనే సమాజం లో ఉన్నాము....
ఆనాధ శవాల్ల ఆడదాని ఆడుకుని వదిలేసే మృగాల మగాళ్ళ మధ్య నలుగుతున్నాము....
తల్లి దండ్రులకు కడుపు కోత మిగిల్చిన కలల పంట ఒకరైతే ,
ఎందుకు పుట్టావ్ రా అనే శోకాన్ని శాపం గా పెట్టే వారున్న కుటుంబాల్లో కుమిలి పోతున్నాము.
అవనీ తల్లీ గర్భమున పుట్టిన ప్రతి ప్రాణి తల దించు కొని... కన్నీరు ప్రవాహ నదిలా పారుతున్నా ....... చూసి ఆనందపడే అద్భుత చరిత గలిగిన ప్రపంచం లో ఉన్నాము.....
ఈ బ్రతుకు ఒక బ్రతుకే నా......
మరి!!!!!
కలల రాజ్యం ఏర్పడే కాలం వస్తుందా?
ఆడపిల్ల స్వేచ్చకి అవకాశం ఉందా?
అక్షర పత్రం లో అక్షరాలు ఆగకుండా రాసి
అందరూ మంచిని ఆచరించే విధంగా ఉండాలి అని
శాశిస్తూ
ఆశిస్తూ
ఆరాటపడుతూ
ఆకాంక్షిస్తూ
ఆశ్రునయనాలతో ఆర్థిస్తూ.......
---మీను 🖋️