మనసు కవి _కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ) ఖమ్మం

మనసు కవి _కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ) ఖమ్మం

మనసు కవి
   _కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ) ఖమ్మం
చరవాణి:7032504646

కనిపించని మనసును పాటల పంజరంలో బంధించి చూపుతాడతను
పలకాలనుకున్న మనసును మాటల తోటలో పలికించే మాటల మాంత్రికుడతను
నిద్రించే వేళలో నిద్ర పుచ్చే మనసు ఉసుల ఊయల గీతమతను
మాట పాటలను సందించడంలో ఆరితేరిన సవ్యసాచి అతను..!

మనసు పలికే మౌన గీత సుమాల పరిమళం అతను
తెలుగు ప్రేక్షకుల మనో సీమలో పాటల రారాజు అతను
వీనుల విందుల విజయ గీతికల ప్రతిధ్వని అతను
శిల్ప సౌందర్యాలను వర్ణించి అంధుల కళ్ళ ముందుంచిన ఘనుడతను...!

ముద్ద బంతి పువ్వుల నవ్వుల్లో ముగ్ధ మనోహరుడతను
మూగ కళ్ళ ఊసులలో ఊటల మాటల పూదోట అతను
మనసు వీణపై హృదయ స్పందనలు పలికించే స్వర ఝరి అతను
చిన్న పదాలతో స్పష్టమైన   భావాల్ని ఒలికించే కలమతను...!

తేట తెలుగు పాటలతో మనుషుల మనుసు దోచే మనుసు కవి అతను
జీవితపు గుట్టు విప్పే మాటల మాంత్రికుడతను
జీవన చదరంగంలో ఒడిదుడుకులను కాచి ఒడబోసిన నగ్నసత్యమతడు...!

ఆత్మీయ ప్రేమానుబంధాల  ముత్యాల హారమతను 
బరువైన భావాలను తేలికైన పద బంధాలతో మలిచిన శిల్పి అతను
కరుణ రస గీతాల కన్నీటి అలల సంద్రం అతను
కృష్ణ మూర్తి సీతమ్మ ల ముద్దుల తనయుడతను 
అతనే...మనసు మీటే మనసు కవి ఆత్రేయ...!


0/Post a Comment/Comments