మా మామయ్య (జానపద గీతం)
---------------------------------------------
మామయ్య మామయ్య
మా మంచి మామయ్య
మా మేన మామయ్య
మా మాటను వినవయ్యా !
మామయ్య మా ఈమామయ్య
మంచి మనసున్న మామయ్య
రేపోమాపో తాను వస్తాడయ్య
పుస్తెల తాడును తెస్తాడయ్యా!
చెప్పిన మాటలు వింటాడు
ఒప్పుగా నాతో ఉంటాడు
పక్కలో దూరుతు ఉంటాడు
చెక్కిలిగిలినే చేస్తుంటాడు. !
నేనే ముద్దుల కోడలును
నేచూస్తా హద్దుల జాడలను
అడుగులో అడుగు వేస్తాను
ఏడడుగులు పూర్తి చేస్తాను !
భ్రమరము లాగా వస్తుంటడు
తిమిరాన్ని తాను తొలగిస్తుండు
తమకం తాపం గమనిస్తుంటడు
ప్రేమ కలాపం సాగిస్తుంటడు. !
సక్కదనాల సెందురుడు
సుక్కల సూసే ఇందురుడు
తలవంచి పనులను చేస్తాడు
మా మంచిచెడ్డలను చూస్తాడు !
సిగ్గుల ముగ్గులు మరి వేస్తుంటడు
నా సిగ్గుల బుగ్గలు కొరికేస్తుంటడు
మాముద్దు ముచ్చట తీరుస్తుంటడు
హద్దులో ఉండి ఏమారుస్తుంటడు !
మా యోగం క్షేమం చూస్తాడు
మాయాగం క్షామం తొలగిస్తాడు
ఇంటిల్లపాదికి తాను వెలిగిస్తాడు
ఇంట్లో శాంతి సౌఖ్యం కలిగిస్తాడు !
గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.
నెంబర్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.