ఇలవేల్పులు పిల్లలు-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

ఇలవేల్పులు పిల్లలు-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

ఇలవేల్పులు పిల్లలు
-----------------------------

ముద్దులొలుకు బాలలు
అందరికీ ఇష్టము
నిర్లక్ష్యం చేస్తే
దేశానికి నష్టము

చిన్నారుల పలుకులు
తేనె వోలె తీయన
గృహమున వారుంటే
పొంగిపొర్లు దీవెన

దేశానికి ఎల్లలు
మన రేపటి పౌరులు
భారతమ్మ బిడ్డలు
బాధ్యతగల వీరులు

పెంచాలి మంచిగా
అగుదురు మహనీయులు
బుద్ధిలోన శుద్దులు
పిల్లలు ఇలవేల్పులు

--గద్వాల సోమన్న

0/Post a Comment/Comments