కోరికలు లేని జీవితం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

కోరికలు లేని జీవితం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

కోరికలు లేని జీవితం..!
(కవిత)
******✍🏻విన్నర్****

ఎంత మనం సంపాదించినా
మన కోరికల్ని, ఆశల్ని చంపుకొని జీవిస్తే..,
మన జీవితంలో ఎలాంటి,
అనుభూతులు స్వంతం చేసుకున్నట్లు కాదు..!

జీవితం మూన్నాళ్ళ ముచ్చట అని నమ్మినప్పుడు,
చిరు కోరికల్ని కూడ అనుభవించకపోవడం అంటే 
ఆశ్చర్యం వేస్తుంది..!??

కేవలం డబ్బు కోసమే జీవించడం అంటే అర్థంలేదు., మరి డబ్బుతో ఆశల్ని కూడ నెరవేర్చు కోవాలి కదా..!? అప్పుడే జీవితం మజానిస్తుంది..!??

గానుగెద్దు లాంటి జీవితం,ఎప్పుడూ కాకూడదు మనిషి జీవితం..?
జీవితానందం లేని జీవితం జీవితం కాజాలదు..!?

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments