గురజాడ ---శ్రీ మతి సత్య మొం డ్రేటి

గురజాడ ---శ్రీ మతి సత్య మొం డ్రేటి


తెలుగు జాడ గురజాడ

కవిదేవా గురజాడ...
వ్యావహారిక తెలుగు భాష గురువు మీరు
సాంఘిక దురాచారాలను తుదముట్టించిన మానవతా వాది
కన్యాశుల్కం నాటకం నాటికి
నేటికీ  మీ ఆదర్షభావాల దర్పణం
మరచి పోదు తెలుగు నేల
సూర్యచంద్రులు ఉన్నంత కాలం
దేశమును ప్రేమించుమన్నా
అన్న మీ జాతీ యతా పలుకులు పతకమై  విరాజిల్లే
జన జాగృతి కి నీవే ప్రవక్త
గురజాడ అప్పారావు గా
మళ్ళీ మా మనసులో
సుస్థిర స్థానాన్ని పొందిన
మహానుభావా మహనీయా..
నీకు ఇవే జన్మదిన శుభాకాంక్షలు..
తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గా భాష ను
తీర్చిదిద్దిన  భాషా కోవిదునికి
నా హృదయాంజలి .......
మహాకవికి అక్షర నీరాజనాలు...

పేరు: శ్రీ మతి సత్య మొం డ్రేటి
ఊరు: హైదారబాద్

0/Post a Comment/Comments