చలం సాహిత్యం --పసుమర్తి నాగేశ్వరరావు

చలం సాహిత్యం --పసుమర్తి నాగేశ్వరరావు

చలం సాహిత్యం

చలం కలం అక్షర హలం
స్త్రీ సౌఖ్యం కోసం కదిపే బలమైన కలం
వాస్తవికతను చూపే మహోజ్వలం
ఆధునిక సాహిత్యానికి కదిలిన స్వేచ్చా కవనం

తమిళ రాష్ట్రంలో మద్రాసులో జననం
అభ్యుదయ సాహితీలోకానికి ఒక నవకవనం
తెలుగు హృదయాల మదిలో నిత్య స్మరణం
స్త్రీ జనోద్ధరణకు కదిలిన గురితప్పని బాణం

ఎందరో రచయితలకు చలం కవిత స్ఫూర్తి
అందుకే సాధించెను అపురూప కీర్తి
సమసమాజ స్థాపనకు కదిలిన విజ్ఞానమూర్తి
తెలుగునాడు గర్వ పడే సాహితీ సంపద గల సాహితీ మూర్తి

ఆలోచనా ఆవేశం అభ్యున్నతి గల వ్యక్తి
సాహితీ పూదోటలో ఒక బలమైన శక్తి
రచనాలలోనే తన భావాన్ని వ్యక్తీకరణ చేసిన మహా యుక్తి
అతివలపై దాడులను ఖండించిన మహోన్నత శక్తి

జనబహిష్కరణ గావింపబడ్డ ఆదర్శవాది
కవిగా నవలా రచయితగా నాటక రచయితగా గల సాహితీవాది
ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న మొండితనం గల ఉదారవాది
తను లేకపోయినా తన భావాలు తో జనం మధ్యన నిలిచిన గొప్ప మానవతావాది

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          సాలూరు
            విజయనగరం జిల్లా


0/Post a Comment/Comments