అపురూపం(కైతికాలు) --మలిచెట్టి శ్రీనివాసులు

అపురూపం(కైతికాలు) --మలిచెట్టి శ్రీనివాసులు

ఆడపిల్ల అనుకుంటూ
అలుసుగా చూడకూడదు
సమభావమనను కుంటూ
బాధ కలిగించ కూడదు
అందరి హక్కులు సమానము
ఆడపిల్ల ఆదిశక్తి రూపము

అందమైన రూపముతో
అందరిని కలుపుకు పోయె
అనురాగపు చూపులతో
ఆత్మీయతలను తెలుపును
అబలలను ఆదరించాలి
అపురూపపు శక్తిని వెలికి తీయాలి

అన్నియు రంగాలలోన
గెలుపు తోడన పోయెదరు
అతి కష్ట కాలములోన
ముందుకు సాగిపోయెదరు
చెదరిపోనిధైర్యము వారిది
ఆత్మవిశ్వాసమే వారి పునాది

మలిచెట్టి శ్రీనివాసులు
  మదనపల్లె, చిత్తూరు జిల్లా
   ఆంధ్రప్రదేశ్ 
  సెల్ నం:9502310187

0/Post a Comment/Comments