వామన జయంతి సందర్భంగా "మహా పాదాద్బుతం" --దొడ్డపనేని శ్రీ విద్య

వామన జయంతి సందర్భంగా "మహా పాదాద్బుతం" --దొడ్డపనేని శ్రీ విద్య

*మహా పాదాద్బుతం
: *శ్రీ వామన జయంతి*

విశేష ఫలితాన్ని కలిగించే
 పరివర్తన ఏకాదశి
ప్రకృతిలో వచ్చే మార్పులకే
ఈ పరివర్తన ఏకాదశి నామం

శ్రీ మహా విష్ణువు నిద్ర కదలికలే వామనావతార దర్శనం
బలి చక్రవర్తి యుద్ధ పరాజయం
మహా బలి పాతాళ లోక 
పయనం

వ్యాస మహర్షి రచించిన గ్రంధం
మహిమాన్విత వామన పురాణం
త్రివిక్రమ స్వరూపుడి ఐదవ అవతారం

కురుక్షేత్ర బ్రహ్మ సరోవర అధ్యాయం
దర్శ సంస్థాపన అవతార నిమిత్తం
గీతా వాక్కు దశావతార ప్రతిబింబం

మోక్షానికి తృప్తి సాధన అనే సందేశం
వామనుడి మూడు పాదముల అద్భుతం
అద్భుత వామన బ్రహ్మాండరూపం

ప్రార్థించిన లభించు అపార పుణ్య ఫలం
దర్శించిన కలుగు సిరి సంపదలమయం
మానవ జీవితాన్ని తీర్చిదిద్దే ఆదర్శవంతమైన అవతారం

ఎన్నో సందేహాలు నివృత్తి చేసే అద్భుత వామనం 
వామన ద్వాదశి గా పిలవబడే సుందర పురాణ కథనం
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కై ఎత్తిన 
విష్ణువు అవతార వైభవం

యాగం కోసం మూడు అడుగుల
 నేల కోరడం
దానం కోరి వచ్చిన మహాద్భుత 
విష్ణు మనోహర రూపం

భూమిపై ఒక మహోన్నత పాదం
ఆకాశం పై రెండో శక్తి పాదం
బలి శిరస్సు పై పాపాలను హరించే మూడవ పాదం

కేరళీయులకు ఓ పర్వదినం
బలి రాక కోసం అత్యంత వైభవ ఓనం
శ్రీ మహా విష్ణువుని పూజించిన 
సకల శుభప్రదం

ఇంతింతై వటుడింతై అన్న పోతన 
భాగవత పద్యం
తెలుగు నాట సుపరిచితం
నిత్య సౌఖ్యాల కోసం
త్రివిక్రమ పరాక్రమ స్మరణం


*దొడ్డపనేని శ్రీ విద్య*
విజయవాడ
12/09/2021 
ఆదివారం
 

0/Post a Comment/Comments