అనురాగాల ఆత్మీయ నేస్తం ---వి. కృష్ణవేణి

అనురాగాల ఆత్మీయ నేస్తం ---వి. కృష్ణవేణి

నేడు కూతుర్ల దినోత్సవం సందర్భంగా..

అనురాగాల ఆత్మీయ నేస్తం.

కంటికి ద్వీపమై వెలుగును పంచి
ఇంటికి రూపమై వెలసిన నా అపురూప దేవత...
అనురాగ మాలిక...
నా కన్నతల్లి ప్రతి రూపానివి నీవేగా..
కంటికి వెలుగై!
అమ్మగా తోడు నీడై..
జన్మజన్మల బంధంగా
జగతికి నీవే పసిపాపగా చూపగా...
నా ఇంటికి నీవే అందాల చందమామవు..
జాబిల్లి లేని లోకం ఎలా ఉండునో..
నీవు లేని నాఇల్లు అంధకారమయమేగా..
చుక్కల్లమధ్య జాబిల్లిలా...
ఇంటిలో నడయాడుతుంటే జన్మధన్యమేగా..
నా తల్లిఋణం తీర్చుకోన నీరూపాన్న...
భాగ్యలక్ష్మిలా ఇంట నడయాడుతుంటే
నా ఇంట సిరుల పంటేగా..
నా ఇల్లు ఒక బృందావనమేగా...
బుడిబుడి అడుగులతో..
కాలిఅందెల సిరిసిరిమువ్వల సవ్వడితో సందడిచేస్తూ తిరుగుతుంటే నాగుండెకు ఆయువు నీవేగా...
ఆదిదేవత స్వరూపానివై...
అష్టలక్ష్మి అవతారానివై..
మాఇంట అదృష్టదేవతగా...
ఇంటికి ఆడపడుచువై  తిరుగుతుంటే నాఇల్లు  విజయాల, ఆయురారోగ్య ఆనందాల హరివిల్లే...
తోబుట్టువులా ఆదరిస్తూ....
స్నేహితురాలుగా తోడుండి కష్టసుఖాలలో సలహాదారిగా ఉంటూ మమతానురాగాలను పంచే కోవెలలో ద్వీపం నీవేగా చిట్టితల్లి...
పుట్టినింట సౌభాగ్యానిచ్చే కల్పవల్లివి...
మెట్టినింట కూడా తల్లిదండ్రుల గౌరవానికి ప్రతీక కావాల్లమ్మ నీవు...
ఆడపిల్ల అంటే "ఆడ"పిల్ల మాత్రము కాదు..
అనురాగాలను పంచే ఆత్మీయనేస్తం అని..
కూతురు అంటే భారంకాదని ఆ ఇంట సౌభాగ్యాల సిరులపంట అని...
అందరి శ్రేయస్సును కోరే కనకమహాలక్ష్మీవి నీవని
చూపావమ్మా..
నా కంటికి వెలుగై ఇంటికి ద్వీపానివై,
ప్రేమకు ప్రతిరూపంగా ఆదరించు
అపురూపమాలికలా..!వి. కృష్ణవేణి
వాడపాలెం.
9030226222.


ప్రక్రియ :వచనం.

0/Post a Comment/Comments