సమాజ నిర్మాత --శ్రీమతి సత్య మొం డ్రేటి

సమాజ నిర్మాత --శ్రీమతి సత్య మొం డ్రేటిసమాజ నిర్మాత

 గురు బ్రహ్మ గురు విష్ణుం గురుడదేవో మహేశ్వర
తస్మై శ్రీ గురువే నమః
గురువు పర బ్రహ్మ స్వరూపం
త్రిమూర్తుల రూపం
అజ్ఞానాంధకారాన్ని తొలగించి
విజ్ఞానాన్ని అందించే జ్ఞాన స్వరూపుడు...
పురంకలం నుండి భారతీయ సంస్కృతిలో గురువు కి మహోన్నత స్థానము తో గౌరవాన్ని పొందిన మన గురువులు.
గురువు ఆజ్ఞ లేనిదే మహారాజులు కూడా ఏ కార్యము  చెయ్యలేరు
గురువు అనే జ్యోతి  వేలాది జ్యోతుల కాంతి కిరణాలను
వెలిగించి దేశ ప్రగతికి నివాళి 
అవుతారు.
నేటి సమాజంలో గురువు తన భాద్యతలు మరచి ధనానికి రాజకీయాలకు,వ్యక్తి పూజకు
అమ్ముడు పోతున్నారు..
ఆత్మవంచన తో  అల్లాడుతున్నారు....శిష్యులు కూడా గురువు గౌరవమర్యాదలు కు భంగం వాటిల్లే లా ప్రవర్తిస్తున్నారు.
తల్లిదండ్రులు జన్మ నిస్థే గురువు జీవితాన్ని బంగారు బాట గా మలచుతాడు.. ఈ నిజాన్ని తెలుసుకున్నారు.. ఉన్నతశిఖరాలు అధిరోహిస్తున్నారు
గురువు తన పాండిత్యాన్ని శిష్యులకు ధార పోసి వారి ఉన్నతికి గర్వపడే గురువులు ఉన్నారు.. మేధావులు ను తయారు చేసిన గురువు త్యాగశీలి గా మిగిలిపోతున్నారు...గురువు వ్యక్తి గా ఎలాంటి వాడైన గౌరవించటం శిష్యుల కర్తవ్యమ్
గురు దేవో భవ  ఆచార్య దేవో భవ...
నా గురువులు అందరికి పాదాభి వందనములు తో నా హృదయ నీరాజనాలు....

పేరు:శ్రీమతి సత్య మొం డ్రేటి
ఊరు: హైదరాబాద్
చరవాణి:9490239581
ప్రక్రియ:వచనం
 

0/Post a Comment/Comments